సెప్టెంబర్ 12న పరీక్ష
విధాత: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష వాయిదా పడింది. ఆగస్టు 1న పరీక్ష జరుగాల్సి ఉండగా దానిని సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. నీట్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అధికారులే మాస్కులు అందజేస్తారని తెలిపారు. విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేందుకు పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచినట్టు పేర్కొన్నారు. అలాగే 3,862గా ఉన్న పరీక్ష కేంద్రాలను కూడా పెంచనున్నట్టు ప్రకటించారు. తెలుగు సహా 11 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. గతేడాది నీట్ పరీక్షను సెప్టెంబరు 13న నిర్వహించారు. 13.66 లక్షల మంది పరీక్ష రాశారు. ఎంబీబీఎస్‌కు 7,71,500 మంది అర్హత సాధించారు.
నేటి నుంచి నీట్ దరఖాస్తులు
<p>సెప్టెంబర్ 12న పరీక్షవిధాత: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష వాయిదా పడింది. ఆగస్టు 1న పరీక్ష జరుగాల్సి ఉండగా దానిని సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. నీట్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అధికారులే మాస్కులు అందజేస్తారని […]</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి