చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర ప్రగతి కోసం ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేయనున్నది. ఆ మండలి సీఎం స్టాలిన్ కు సూచనలు చేస్తుందని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇవాళ అసెంబ్లీలో తెలిపారు.అయితే ఆ సలహా మండలిలో ఆర్థిక నోబెల్ బహుమతి గ్రహీత ఉండనున్నారు.మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నోబెల్ గ్రహీత ఈస్తర్ డఫ్లోతో పాటు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రంజన్,ఆర్థికశాఖ మాజీ సలహాదారు అరవింద్ సుబ్రమణియన్,డెవలప్మెంట్ ఎకానమిస్ట్ జీన్ డ్రీజ్,మాజీ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్. నారాయణ్ ఆ బృందంలో ఉంటారు.ఆర్థిక సలహా మండలి ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయనున్నట్లు గవర్నర్ తెలిపారు.