Site icon vidhaatha

సెప్టెంబర్‌ 25న వరవరరావు సరెండర్‌ కావాలి: బాంబే హైకోర్టు

విధాత,ముంబై:ఎల్గార్‌ పరిషత్‌-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ గడువు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరవరరావు తన బెయిల్‌ను పొడగించాలని విజ్ఞప్తి చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. సెప్టెంబర్‌ 25న వరవరరావు సరెండర్‌ కావాలని ఆదేశించింది.పిటిషన్‌ విచారణ సందర్భంగా వరవరరావు కోర్టు తనకు ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిందని.. ఫలితంగా తాను కుంటుంబానికి దూరంగా ఉంటున్నానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 84 ఏళ్ల వయసులో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్ట్ విధించిన ఏ ఒక్క షరతును తాను ఉల్లంగించలేదని వరవరరావు కోర్టుకు తెలిపారు. ముంబై హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకోవాలంటే తన లాంటి వారికి చాలా కష్టం అవుతుందన్నారు.

తన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే తన కుటుంబం దగ్గరికి వెల్లేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వరవరరావు వాదనలు విన్న కోర్టు ఈ నెల 25న ఆయనను సరెండర్‌ కావాలని ఆదేశించింది. ఎల్గార్ పరిషత్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు గత 4 సంవత్సరాలుగా ముంబైలోనే ఉంటున్నారు.భీమా కోరేగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావు.. తన బెయిల్‌ పొడిగించాలంటూ బాంబే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వరవరరావు పిటిషన్‌ను బాంబే కోర్టు విచారణకు స్వీకరించింది. ఆరు నెలల క్రితం వరవరరావుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిన్‌ను మంజూరు చేసింది. పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ చేపట్టనున్నట్లు బాంబే కోర్టు తెలిపింది.నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావు 2018 నవంబర్‌లో అరెస్ట్‌ అయ్యారు. అదే సంవత్సరం జూన్‌లో సోమ్‌సేన్‌తో సహా మరో అయిదుగురుని ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న హింస చెలరేగింది. 200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరేగావ్‌ యుద్ధాన్ని స్మరించుకునేందుకు దళితులు చేసిన ప్రయత్నం చివరకి అల్లర్లకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా,పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.

Exit mobile version