విధాత : అడవిలో వన్యప్రాణుల మధ్య ఘర్షణలు సాధారణంగా జరుగుతుంటాయి. అయితే అవి ఒక్కోసారి చాల తీవ్రమైన పోరుకు దిగడం ఆసక్తికరంగా మారుతుంటుంది. పులుల మధ్య ఆధిపత్య పోరు, సింహాలు, ఏనుగుల మధ్య ఘర్షణలు భీకర గర్జనలు..ఘీంకారాలతో సాగుతూ భయపెడుతుంటాయి. తాజాగా ఓ అడవిలో రెండు భారీ ఎలుగుబంట్ల మధ్య రేగిన తగాదా వాటి మధ్య భీకర పోరుకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
రెండు కూడా భారీ సైజులో బలిష్టంగా ఉన్న ఎలుగుబంట్లు కావడంతో పోరులో ఏది కూడా తగ్గేదే లేదన్నట్లుగా కలబడ్డాయి. రెండు ఎలుగుబంట్లు పోరులో భయాంకర గర్జనలు చేస్తూ.. ఆయాసం వచ్చేదాక రొప్పుతు..కింద మీద పడి మరి కొట్లాట సాగించాయి. చివరకు అవి కొట్లాడి కొట్లాడి అలసిపోయి శాంతించాయి. ఇందులో ఏది గెలిచిందో..ఏది ఓడిందో మాత్రం చెప్పడం కష్టమే. వీడియో చూసిన నెటిజన్లు వామ్మో..ఎలుగుబంట్ల పోరు ఇంత భీకరంగా ఉంటుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.