విధాత : ప్రాచీన కళలు..విద్యతో పాటు ఆధునిక శాస్త్ర సాంకేతికతకు నెలవు చైనా దేశం. ప్రపంచంలోనే అద్బుతాలు అనబడే వంతెనలు..భవనాలు, రోబోలు, వాహనాలు, అంతరిక్ష వాహక నౌకలు, యుద్ద వాహనాలు, విమానాలు, క్షిపణులు వంటి నిర్మాణాలలో చైనా ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. అదే స్థాయిలో ప్రాచీన కళలను, వృత్తులను, సంస్కృతిని కూడా చైనా పరిరక్షించుకుంటూ వస్తుంది. తాజాగా ఒక చైనీస్ వృద్ధ కళాకారుడు తాజా వెదురు ఆకులను అంత్యంత నైపుణ్యంతో ఉపయోగించి అందమైన మహిళా బొమ్మలను, బహుళ అంతస్తుల ఇళ్లను, టవర్స్ ను సృష్టించిన వీడియో నెట్టింటా ప్రశంసలందుకుంటుంది.
వెదురు ఆకులె పుల్లలతో చైనీస్ వృద్ద కళాకారుడు ఆకుపచ్చ గౌన్ ధరించిన యువతితో పాటు శిరస్త్రాణాలను ధరించిన చైనీస్ యువరాణిని, సాంప్రదాయ దుస్తులను ధరించిన వధువులను తలపించేలా అద్బుతంగా మహిళా బొమ్మలను తయారు చేశాడు. సాంప్రదాయ తూర్పు ఆసియా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.
అలాగే వెదురుతోనే గోపురాలు, సొరంగాలు, ప్లాట్‌ఫారమ్‌లు, మెట్లు, రాజ ప్రసాదాలు, డూప్లెక్స్ లతో కూడిన బహుళ అంతస్తుల పిల్లి ఇంటిని నిర్మించిన తీరు వీడియోలలో ఆకట్టుకుంది. ప్రాచీనా చైనా నుంచి దాదాపు 7000సంవత్సరాల నుంచి వెదురుతో బొమ్మలు తయారు చేసే హస్తకళలు కొనసాగుతున్నాయని..ఇది ప్రాచీనా చైనా వైభవానికి నిదర్శనమని ఆ దేశం గర్వంగా చెబుతుంది. ప్రాచీన హస్తకళల పరిరక్షణకు చైనా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది.
Beautiful working by old man 😱 pic.twitter.com/yWkjROvaxR
— lun (@luneafaw) December 8, 2025
ఇవి కూడా చదవండి :
Peacock Feather Dance : నూకలు వేసింది..నాట్య మయూరిని చూసింది
Hyderabad Middle Class Housing Crisis | మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు
