Viral |
విధాత: కంగారూలకు ప్రసిద్ధి ఆస్ట్రేలియా. ఇవి ఆస్ట్రేలియా జాతీయ జంతువు కూడా. చిన్న జుట్టు, పెద్ద పాదాలు, పొడవైన తోక తో కడుపు భాగంలో ఉండే సంచిలో పిల్లలను మోస్తూ కనువిందుగా ఉంటాయి. అయితే తాజాగా ఆస్ట్రేలియాలో ఒక భారీ కంగారూ జంతువు కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎందుకంటే సహజంగా కంగారులు ఉండే ఆకారానికి భిన్నంగా పెద్ధ సైజులో ఏకంగా 9 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అద్భుతమైన కంగారూ ముందెన్నడు వారు చూడలేదు. దీంతో ఆ భారీ కంగారూ జంతువును చూసిన స్థానికులకు కొద్ధిసేపు నోట మాట రాలేనంతగా అవాక్కయ్యారు.
మార్సుపియల్స్ కు చెందిన ఈ భారీ కంగారూ చూసేందుకు జనం ఎగబడ్డారు. సాదారణంగా అస్ట్రేలియన్ జాతి కంగారూలు 6 ఆడుగుల ఎత్తు వరకు ఎదుగుతాయి. చాల అరుదుగా అంతకంటే ఎక్కువ ఎత్తు పెరిగిన కంగారూలు కనిపిస్తుంటాయి. కంగారూ జంతువులు దాదాపు పదివేల సంవత్సరాలుగా స్థానిక ఆస్ట్రేలియన్లకు ఆహార వనరుగా ఉన్నాయి. కంగారుల్లో ఎర్ర కంగారు, తూర్పు బూడిద రంగు కంగారూ, పశ్చిమ బూడిద రంగు కంగారూ, యాంటిలో పైన్ కంగారూ రకాలు ప్రసిద్ది గాంచాయి. కంగారూల సమూహాన్ని మాబ్ అంటారు. మగ కంగారూను బూమర్ అని, ఆడ కంగారూను జిల్ అని అంటారు.కంగారూలు కఠినమైన శాకాహారులు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ ప్రజల కంటే కంగారూలు ఎక్కువ. ఇదిలాఉండగా.. ఈవీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది.