విధాత : మంచు యుగంలో…వేల ఏళ్ల క్రితమో..భూమి మీద డైనోసార్లు సంచరించడం మనం చరిత్రలో విన్నాం..చదివాం. జురాసిక్ పార్క్ వంటి వాటిలో డైనోసార్లను తెరపై చూశాం. నిజంగా డైనోసార్లును చూసిందెవరు లేరు. అయితే డైనోసార్ ను తలిపించేలా ఓ భారీ మొసలి ఈ భూమి మీద సంచరిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. భీకర ఆకారంతో డైనోసార్ మాదిగా నడక సాగిస్తూ ఓ నీటి కొలను నుంచి మరో నీటి కొలనులోని సాగిపోతున్న ఆ మొసలిని చూస్తే గుండె జల్లుమని అనక మానదు. ఈ బాహుబలి మొసలి ఫ్లోరిడాలో పెరుగుతున్నట్లుగా సమాచారం. అయితే అధికారిక లెక్కల మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద మొసలిగా దక్షిణాఫ్రికాలోని హెన్రీ పేరొందింది. దీని వయసు ఏకంగా 124ఏళ్లు. 1900సంవత్సరంలో జన్మించిన ఈ మొసలిని 1903లో పట్టుకున్నారు. అప్పటి నుంచి దక్షిణాఫ్రికాలోని జంతు సంరక్షణ కేంద్రంలో పెరుగుతుంది. 700కిలోల బరువు, 18అడుగుల పొడవు ఉంటుంది.
అయితే ఏడాది క్రితం వరకు ఆస్ట్రేలియాలోని సంరక్షణ కేంద్రంలోకాసియస్ అనే పేరుతో పిలిచే ఉప్పునీటి మొసలి 18అడుగుల పొడవుతో భారీ ఆకారంతో 112ఏళ్లు జీవించి ప్రపంచంలోనే అతిపెద్ద మొసలిగా నిలిచింది. దాని తర్వాతా హెన్రీ అతి పెద్ద మొసలిగా కొనసాగుతుంది. భారీ మొసళ్లు ఎక్కువగా ఆగ్నేయాసియా, సుండాలాండ్ నుంచి ఉత్తర ఆస్ట్రేలియా, మైక్రోనేషియా, ఆఫ్రికా దేశాల వరకు ఉన్న ఉప్పునీటి, మంచినీటి నదులు, సరసులలో జీవిస్తున్నాయి. వీటి బరువు వెయ్యి నుంచి 1500 కేజీల బరువు ఉండగా.. పొడవు 20 ఫీట్లు ఉంటుంది.
ఒకప్పుడు 28అడుగుల పొడవు ఉన్న క్రిస్ సవన్నా కింగ్ అనే ఉప్పు నీటి మొసలిని అస్ట్రేలియాలోని క్విన్ ల్యాండ్ లో కాల్చి చంపారు. తర్వాతా పిలిప్పిన్స్ లో 2011లో పట్టుబడిన లోలాంగ్ అనే మొసలి 20అడుగులు, 1,075కిలోగ్రాముల బరువు తో 2013వరకు జీవించింది. ఆ తర్వాతా ఆడిలైడ్ నదిలో 20అడుగుల డామినేటర్, 20అడుగుల బురుండిలోని గుస్తావే మొసలులు రికార్డు కాలం బతికాయి. ధాయిలాండ్ లోని సమత్ర్పకర్న క్రొకొడైల్ ఫామ్ లో యై అనే 19అగుడు మొసలి, మలేషియా బుజాంగ్ లోని 19అడుగుల బుజాంగ్ సెనాంగ్, ఆడిలైడ్ లోని 18అడుగుల బ్రూటస్, ప్లోరిడాలోని సెయింట్ ఆగస్టిన్ ఎలిగేటర్ ఫామ్ లోని 17అడుగుల గోమెక్ భారీ మొసళ్లు వాటి జీవిత కాలంలో భారీ మొసళ్లుగా గుర్తింపు పొందాయి.
