Bengal Tiger Climbing Tree : నిటారు చెట్టును ఎక్కెసిన పెద్దపులి..వైరల్ వీడియో

బరువు కారణంగా పెద్దపులులు చెట్లు ఎక్కలేవన్నది సాధారణం. కానీ, 200 కిలోల ఈ రాయల్ బెంగాల్ టైగర్ నిటారు చెట్టును సునాయసంగా ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Bengal Tiger Climbing Tree

విధాత : అడవికి సింహం, పెద్దపులులు రాజు వంటివి. ముఖ్యంగా పెద్దపులి వేటలో..పోరాటంలో ప్రత్యేకమైనది. అయితే చిరుత పులుల మాదిరిగా వేగంగా పరిగెత్తడం..వేట నైపుణ్యం..చెట్లపైకి ఎక్కడం వంటివి పెద్ద పులులు చేయలేవు. పెద్దపులులు బరువైన జంతువులు కావడంతో వాటికి చెట్లను ఎక్కడం కష్టతరం. అది వాటి ప్రకృతి ధర్మం. అయితే అందుకు విరుద్దంగా ఓ పెద్ద పులి నిటారుగా ఉండే చెట్టును సులభంగా ఎక్కెసిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. బరూచ్ అనే రాయల్ బెంగాల్ టైగర్ ఒక అభయారణ్యంలో శిక్షకుడి మార్గదర్శకత్వంలో తాడుతో చుట్టబడిన నిటారు చెట్టును సులభంగా ఎక్కెసింది. ఆ పెద్ద పులి దాదాపు 200కిలోల బరువు ఉన్నప్పటికీ శిక్షణలో నేర్చుకున్న మెళకువలతో పాటు చెట్టు చుట్టూ చుట్టిన తాడు జారకుండా గ్రిప్ గా సహాయ పడుతుండటంతో అది సునాయసంగా చెట్టును అధిరోహించగలిగింది.

1969 బంగ్లాదేశ్ వరదల సందర్బంగా నిర్వహించిన అధ్యయనంలో పులులు విపత్కర పరిస్థితిలో అరుదుగా చెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తుంటాయని గుర్తించారు. అయితే వాటి బరువైన శరీరం అందుకు ప్రతికూలంగా మారుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. పులులు చెట్టు ఎక్కే ప్రయత్నాలు వాటిని ప్రమాదాల పాలు చేస్తాయంటున్నారు. అయితే శిక్షణ, తగిన గ్రిప్ వంటి భద్రతా చర్యల మధ్య చెట్టు ఎక్కే విన్యాసాలు అనుమతించవచ్చంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Iran Red Beach : సముద్రం రక్తంతో నిండిందా…!
Akhanda 3 | ‘అఖండ 3’పై బోయపాటి శ్రీను క్లారిటీ .. అవెంజర్స్ స్థాయి స్కోప్ ఉందంటూ కీలక వ్యాఖ్యలు

Latest News