Akhanda 3 | ‘అఖండ 3’పై బోయపాటి శ్రీను క్లారిటీ .. అవెంజర్స్ స్థాయి స్కోప్ ఉందంటూ కీలక వ్యాఖ్యలు

Akhanda 3 |నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. ఇప్పటివరకు ఈ కాంబోలో వచ్చిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ‘అఖండ 2’ కూడా ఈ విజయాల జాబితాలో చేరింది.

Akhanda 3 |నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. ఇప్పటివరకు ఈ కాంబోలో వచ్చిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ‘అఖండ 2’ కూడా ఈ విజయాల జాబితాలో చేరింది. రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఓపెనింగ్స్‌పై కొంత ప్రభావం పడినప్పటికీ, సినిమా మాత్రం మంచి టాక్‌తో ముందుకు సాగింది. ఇక అఖండ సిరీస్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో అఖండ 2 ప్రమోషన్స్ సమయంలోనే ఈ సిరీస్‌ను మరిన్ని భాగాలుగా తీసుకెళ్లే ఆలోచన ఉందని మేకర్స్ పేర్కొన్నారు. అఖండ 2 క్లైమాక్స్‌లోనే పార్ట్ 3కి స్పష్టమైన లీడ్ ఇవ్వడం కూడా ఈ ఊహలను మరింత బలపరిచింది.

అఖండ 3పై బోయపాటి కీలక వ్యాఖ్యలు

అఖండ 2 సక్సెస్ అనంతరం మీడియాతో మాట్లాడిన దర్శకుడు బోయపాటి శ్రీను, అఖండ 3పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా అవెంజర్స్ స్థాయి స్కోప్ ఉన్న కథ. అవెంజర్స్ లాంటి సూపర్ హీరోలను రచయితలు సృష్టించారు. కానీ మన దగ్గర పురాణాల్లోనే నిజమైన సూపర్ హీరోలు చాలా మంది ఉన్నారు. మన చరిత్ర నుంచే ఎన్నో కథలు తీసుకురావచ్చు,” అని తెలిపారు. అలాగే, సీక్వెల్స్ విషయంలో తొందరపడటం సరైంది కాదని స్పష్టం చేశారు. ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంటవెంటనే సీక్వెల్స్ తీస్తే బాగోదు. రెండు మూడు సినిమాల గ్యాప్ తీసుకుని మళ్లీ చేయాలి. నేను కూడా వేరే సినిమాలు పూర్తి చేసిన తర్వాతే అఖండ 3 గురించి ఆలోచిస్తాను,అని అన్నారు.

అఖండ 3 ఎక్కడి నుంచి మొదలవుతుంది?

అఖండ 2 క్లైమాక్స్‌లో చూపించిన శంబాలా తలుపులు తెరుచుకునే సన్నివేశం నుంచే అఖండ 3 కథ ప్రారంభమవుతుందని బోయపాటి వెల్లడించారు. దీంతో అఖండ 3 ఖచ్చితంగా ఉంటుందని, అయితే కొంత గ్యాప్ తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని స్పష్టత వచ్చింది. బోయపాటి మరో రెండు సినిమాలు చేసిన తర్వాత మళ్లీ బాలకృష్ణతో ‘అఖండ 3’ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సిరీస్‌ను మరింత భారీ స్థాయిలో తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Latest News