విధాత: ప్రకృతిలో చెట్టు..పుట్టలలోనూ దేవుళ్లను చూసే దేశంలో ఓ చెట్టు..పుట్ట దేవుళ్ల ఆకారంలో కనిపిస్తే అది వెంటనే భక్తిరస అంశంగా మారక తప్పుదు. ఇప్పుడు ఓ చీమల పుట్ట శివలింగం ఆకారంలో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల పరిధిలో ఓ వ్యవసాయ క్షేత్రంలో చీమలు పెట్టిన పుట్ట శివలింగం ఆకారంలో కనిపించిన అరుదైన దృశ్యం కంటపడింది. చీమలు పెట్టిన పుట్ట శివలింగం ఆకారంలో కనిపించడంతో స్థానికులు తండోపతండాలుగా వెళ్లి ఆశ్చర్యంగా తిలకిస్తూ భక్తితో మొక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది.
సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా పానవట్టంతో కూడిన శివలింగాకృతిలో ఉండడంతో అది జనాన్ని ఆకట్టుకుంటుంది. అసలే చీమలను ఇంజనీర్లకు ప్రతిగా భావిస్తుంటాం. మరి అలాంటి మేధావి వర్గం చీమలు అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులు..వర్షాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు శివలింగాకృతిలో పుట్టను నిర్మించుకున్నట్లుగా భావిస్తున్నారు. అసలే ఇదిగో రాయి అంటే అదిగో దేవుడన్నట్లుగా ఉంటే సమాజంలో ఇప్పుడు ఈ శివలింగం చీమల పుట్ట సైతం ఆసక్తికర అంశంగా మారింది.
శివలింగం ఆకారంలో చీమల పుట్ట
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల పరిధిలో కనిపించిన అరుదైన దృశ్యం
చీమలు పెట్టిన పుట్ట శివలింగం ఆకారంలో కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తున్న స్థానికులు
సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా ఉండడంతో ఆకట్టుకుంటున్న వైనం pic.twitter.com/elVwfICvYU
— BIG TV Breaking News (@bigtvtelugu) August 1, 2025