వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మేఘాలు ఐస్ క్రిస్టల్స్‌తో నిండి ఉంటాయి. వాటిపై సూర్యకాంతి పడ్డప్పుడు అవి వక్రీభవిస్తాయి. అందుకే ఇలా వలయంగా ఏర్పడుతుంది. ఇది సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థంతో రింగ్ రూపాన్ని తీసుకుంటుంది.
వృత్తాకార హాలో ప్రత్యేకంగా సిరస్ మేఘాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. సిరస్ మేఘాలు సన్నగా, విడివిడిగా, జుట్టులాంటి ఆకారాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఈ మేఘాలు వాతావరణంలో చాలా ఎత్తులో అంటే 20వేల అడుగుల ఎత్తులో ఏర్పడతాయి.
UK అట్మాస్ఫియరిక్ ఆప్టిక్స్ ప్రకారం, మంచు స్ఫటికాల ద్వారా కాంతి ప్రతిబింబించినప్పుడు, వక్రీభవించినప్పుడు, చెదరగొట్టబడటం వలన మేఘాలు ఇలా రంగులుగా విడిపోతాయి. ఇలా మేఘాలు ఏర్పడినప్పుడు 24 గంటల్లోగా వర్షం పడుతుంది. ఇలాంటి ఆకాశ అద్భుతాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.