Large Sinkhole In UK : భూమి బద్దలైందా ! కాలువ కింద భారీ హోల్..తప్పిన ప్రాణనష్టం

ఇంగ్లాండ్‌లోని ష్రాప్‌షైర్ యూనియన్ కెనాల్ కింద ఒక్కసారిగా భారీ సింక్‌హోల్ ఏర్పడింది. కాలువ నీరు పడవలతో సహా భూగర్భంలోకి వెళ్లిపోతుండగా, 12 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.

Large Sinkhole In UK

విధాత : నిండుగా నీటితో పారుతున్న కాలువ…నీటిలో ముందుకు సాగుతున్న పడవలు. అకస్మాత్తుగా భూమి పగిలినట్లుగా కాలువ నీరు భూమిలోకి వేగంగా వెళ్లిపోతుంది…కట్టలు తెగి కాలువ నీరు చెల్లచెదురైంది. నీటిలోని పడవలు కాలువ నీటి కింద పడిన భారీ హోల్ లో చిక్కుకుపోయాయి. వినడానికి ఇదంతా ఓ హాలీవుడ్ సినిమాను సీన్స్ లా ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్‌లోని ష్రాప్‌ షైర్‌ కౌంటీ విట్‌చర్చ్‌లో ఇవన్ని నిజంగా చోటుచేసుకున్న భయానక ఘటనలోని దృశ్యాలే. విట్ చర్చ్ ష్రాప్‌షైర్ యూనియన్ కెనాల్‌ కింద భారీ సింక్‌ హోల్‌ ఏర్పడింది. పలు పడవలు వేగంగా భూగర్భంలోకి వెళ్లిపోతున్న నీటిలో చిక్కుకున్నాయి. పడవల్లో సుమారు 12 మంది ఉన్నారు. వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. భారీ గొయ్యి ఏర్పడిన నేపథ్యంలో ఆ ప్రాంతం వైపు వెళ్లొద్దని ప్రజలకు యూకే పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాదాపు 50 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పులో ఈ గొయ్యి ఉన్నట్లు తెలిపారు.

అస్థిరమైన నేల, బురద, వేగంగా కదులుతున్న నీరు కారణంగా రెస్క్యూ సిబ్బంది క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, కానీ 12మందికి పైగా సురక్షితంగా తీసుకురాగలిగామని ష్రాప్‌షైర్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. కాలువ నుండి నీరు… చుట్టుపక్కల పొలాల్లోకి ప్రవహించడంతో అవన్ని ముంపుకు గురయ్యాయి. ఈ సంఘటన చాలా విధ్వంసకరంగా భయపెట్టేలా జరిగిందని, ప్రజలు భూకంపం శబ్ధాలను, నీటి ధ్వనులను విన్నారని ఏం జరుతుందో అర్ధంకాక ఆందోళనకు గురైనట్లుగా స్థానికులు తెలిపారు. ప్రమాదం నుంచి భయటపడిన వారు ఇదంతా తమకు ఓ భయంకర అనుభవాన్ని మిగిల్చిందని నమ్మలేకుండా ఉన్నామని వాపోయారు.

బ్రిటన్ లో సన్నిని ఇరుకైన కాలువల వ్యవస్థను ప్రయాణికులు, సరుకు రవాణాకు వినియోగిస్తున్నారు. ఈ కాలువలో ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించిన పొడవైన పడవలను విగియోగిస్తుంటారు. వీటిని తేలియాడే ఇళ్లుగా, విహార పడవలుగా కూడా పిలుస్తారు. ప్రమాద ఘటనపై అధికారుల బృందాలు విచారిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Tiger vs Duck Viral Video : పెద్దపులిని ఆటాడుకున్న బాతు..నవ్విస్తున్న వీడియో
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు!

Latest News