Site icon vidhaatha

Suravaram Sudhakar Reddy | ‘సుర‌వ‌రం’ పార్థివ‌దేహం గాంధీ ఆస్ప‌త్రికి దానం..!

Suravaram Sudhakar Reddy | హైద‌రాబాద్ : సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి(83)( Suravaram Sudhakar Reddy  ) తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుర‌వ‌రం పార్థివ‌దేహాన్ని గాంధీ ఆస్ప‌త్రి( Gandhi Hospital )కి దానం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు.

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి.. గ‌చ్చిబౌలిలోని కేర్ ఆస్ప‌త్రి( Care Hospital )లో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. విష‌యం తెలుసుకున్న సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డి రాజా నేరుగా కేర్ ఆస్ప‌త్రి వెళ్లి.. సుర‌వ‌రం స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మిని ప‌రామ‌ర్శించారు.

సుధాక‌ర్ రెడ్డి ఇద్ద‌రు కుమారుల్లో ఒక‌రైన నిఖిల్ అమెరికాలో ఉంటున్నారు. శ‌నివారం రాత్రి వ‌ర‌కు ఆయ‌న హైద‌రాబాద్ చేరుకోనున్నారు. అప్ప‌టి వ‌ర‌కు సుర‌వరం పార్థివ‌దేహాన్ని కేర్ ఆస్ప‌త్రి మార్చురీలోనే ఉంచ‌నున్నారు. నిఖిల్ హైద‌రాబాద్ చేరుకోగానే.. అభిమానుల సంద‌ర్శ‌నార్థం హిమాయ‌త్‌న‌గ‌ర్‌లోని పార్టీ కార్యాల‌యంలో ఆదివారం ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు ఉంచ‌నున్నారు. అనంత‌రం సీపీఐ కార్యాల‌యం నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర్యాలీగా వెళ్లి సుర‌వ‌రం భౌతిక‌కాయాన్ని గాంధీ ఆస్ప‌త్రికి దానం చేయ‌నున్నారు కుటుంబ స‌భ్యులు.

Exit mobile version