బాలీవుడ్ ఎవ‌ర‌య్య సొత్తు కాదు: విద్యాబాలన్

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తన రాబోయే చిత్రం దో ఔర్‌ దో ప్యార్ ప్రమోష‌న్‌లో భాగంగా సంచ‌ల వ్యాఖ్య‌లు చేసింది. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో

  • Publish Date - April 13, 2024 / 11:04 PM IST

ముంబై : బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తన రాబోయే చిత్రం దో ఔర్‌ దో ప్యార్ ప్రమోష‌న్‌లో భాగంగా సంచ‌ల వ్యాఖ్య‌లు చేసింది. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లోని అవ‌క‌త‌వ‌క‌ల‌పై అనేక విషయాలు బ‌య‌ట‌పెట్టింది. సినీప‌రిశ్ర‌మ‌లో వార‌స‌త్వం ఉన్న‌వారే స‌క్సెస్ అవుతార‌న్న విష‌యాన్ని ఖండించింది. బాలీవుడ్‌లో అనేక మంది స్టార్‌ల పిల్ల‌లు వాళ్ల క‌ష్టంతోనే పైకి వ‌చ్చార‌ని తెలిపింది.

2005లో వ‌చ్చిన‌ పరిణీత సినిమాతో విద్యాబాలన్ బాలీవుడ్ లో తన ప్రయాణాన్ని మొద‌లు పెట్టింది. తొలి దశలో ఆమె పరిశ్రమలో అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నది. పరిశ్రమ లోకి రాక ముందు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేదు. తన ప్రయాణంలో ఎదురైన సమస్య లను నిబ్బరంగా ఎదుర్కొంది. అనుభవంతో నేర్చుకుంది. అవసరాలకు అనుగుణంగా తనకు తాను మారుతూవచ్చింది.ఆమె చేసిన కృషి ఈ రోజు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ గా పేరు తెచ్చింది.

బాలీవుడ్‌లో ప‌క్ష‌పాత ధోర‌ణి ఉందంటారా అన్న ప్ర‌శ్న‌కు విద్యా స్పందిస్తూ.. బాలీవుడ్ లో అన్ని విషయాలను పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ పరిశ్రమ ఎవరి అయ్య సొత్తు కాదు. ఎవ‌రి పిల్ల‌లైన సక్సెస్ కావడానికి పరిశ్రమ లోసమిష్టి కృషి ఉంటుంది, వ్యక్తిగత శక్తి సమర్ధతలు ప్రదర్శించాలి, దానికి తోడు మంచి క్రియేటివిటీ కూడా ఉండాలి, వీటిపై ఆధారపడి విజయం వరిస్తుందని, అంతేతప్ప మరోదానికి అవకాశం లేదన్న‌ది. విద్యాబాల‌న్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా దో ఔర్ దో ప్యార్‌లో ప్రతీక్ గాంధీ, ఇలియానా, సెంథిల్ రామ్మూర్తి న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 19న దేశ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న‌ది. ఇటీవ‌లే త‌న పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ప్ర‌జ‌ల‌కు ఉద్యోగ అవ‌కాశాలు ఎర‌వేసి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారని, ఇవ్వ‌కుంటే బెదిరిస్తున్నట్లు తెలిసింద‌న్నారు. వెంట‌నే ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 66 ( సి) ఐటి చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని విద్యాబాల‌న్‌ తెలియజేసింది.

Latest News