Site icon vidhaatha

Liquor Shops | ఏపీలో 155 లిక్క‌ర్ షాపుల‌కు ఢిల్లీ వ్యాపారి ద‌ర‌ఖాస్తు.. కానీ త‌గిలింది ఆరు మాత్ర‌మే..!

Liquor Shops | అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌( Andhra Pradesh )లో కొత్త మ‌ద్యం విధానం( Excise Policy )లో భాగంగా బుధ‌వారం నుంచి ప్ర‌యివేటు మ‌ద్యం దుకాణాలు( Liquor Shops ) తెరుచుకోనున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా లాట‌రీ ద్వారా లైసెన్సీల ఎంపిక పూర్త‌యింది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా, 89,882 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇందులో కొంద‌రు వంద‌ల సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తు చేశారు. కానీ అదృష్టం వ‌రించ‌లేదు. అయితే ఏపీలో మ‌ద్యం దుకాణాలకు లాట‌రీ నిర్వ‌హించిన సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న వెలుగు చూసింది.

విశాఖ‌ప‌ట్నం జిల్లా( Vizag )లో ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ ప‌డ్డారు. వీరితో పాటు ఢిల్లీ( Delhi )కి చెందిన ఓ వ్యాపారి కూడా పోటీ ప‌డ్డారు. స్థానిక సిండికేట్ల‌ను మించి 155 మ‌ద్యం దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అమిత్ అగ‌ర్వాల్, నందినీ గోయ‌ల్, సారికా గోయ‌ల్, సౌర‌భ్ గోయ‌ల్ పేర్ల‌తో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు.

ఒక్కో దుకాణ లాట‌రీకి ద‌ర‌ఖాస్తు చేసిన 24 నుంచి 30 మంది మారుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం అక్క‌డ్నుంచి క‌ద‌ల్లేదు. వ‌రుస‌గా అన్ని దుకాణాల లాట‌రీ నిర్వ‌హ‌ణ‌లోనూ పాల్గొన‌డంతో క‌లెక్ట‌ర్, జాయింట్ క‌లెక్ట‌ర్, ఎక్సైజ్ సిబ్బంది ఆరా తీశారు. 155 మ‌ద్యం దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు స‌ద‌రు వ్య‌క్తి చెప్ప‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. ఇక ఈ షాపుల‌న్నింటికీ ద‌ర‌ఖాస్తు రుసుమే రూ. 3 కోట్లు. కోట్ల రూపాయాలు ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించిన ఢిల్లీ వ్యాపారికి లాట‌రీలో కేవ‌లం 6 దుకాణాలు మాత్ర‌మే ద‌క్కాయి. దీంతో ఆ వ్యాపారి కాస్త నిరుత్సాహానికి గుర‌య్యారు.

Exit mobile version