పురపాలక బాండ్లలో అమరావతిదే అగ్రస్థానం

<p>దేశంలోనే అత్యధికం రూ.2వేల కోట్ల సమీకరణ విధాత,అమరావతి: పురపాలక బాండ్ల ద్వారా నిధుల సమీకరణలో అమరావతి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. నగర అభివృద్ధికి జారీచేసిన రూ.2వేల కోట్ల బాండ్లను మరే నగరం దాటలేకపోయింది. 2018-19 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది నగరాలు/ పట్టణాభివృద్ధి సంస్థలు నిధుల సమీకరణకు బాండ్లను జారీచేశాయి. మొత్తం రూ.3,840 కోట్లు సేకరించాయి. ఇందులో అమరావతి నగరమే ముందుంది. 2018లో రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లకు బాండ్లను జారీచేయగా.. […]</p>

దేశంలోనే అత్యధికం రూ.2వేల కోట్ల సమీకరణ

విధాత,అమరావతి: పురపాలక బాండ్ల ద్వారా నిధుల సమీకరణలో అమరావతి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. నగర అభివృద్ధికి జారీచేసిన రూ.2వేల కోట్ల బాండ్లను మరే నగరం దాటలేకపోయింది. 2018-19 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది నగరాలు/ పట్టణాభివృద్ధి సంస్థలు నిధుల సమీకరణకు బాండ్లను జారీచేశాయి. మొత్తం రూ.3,840 కోట్లు సేకరించాయి. ఇందులో అమరావతి నగరమే ముందుంది. 2018లో రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లకు బాండ్లను జారీచేయగా.. వాటికి విశేష స్పందన లభించింది. దీన్ని అమరావతి బ్రాండ్‌కు దక్కిన గుర్తింపుగా అప్పట్లో పలువురు పేర్కొన్నారు.