Lok Sabha Elections | పెండ్లి కొడుకుగా ముస్తాబై పోలింగ్‌ కేంద్రానికి వరుడు.. Video

Lok Sabha Elections | ఈ ప్రజాస్వామ్య దేశంలో సామాన్యుడి చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. కానీ లక్షల మంది ఓటర్లు ఆ ఆయుధానికి గౌరవం ఇవ్వడం లేదు. పోలింగ్‌ రోజు ఇంటి నుంచి బయటికిరారు. ఎవడు గెలిస్తే మనకేంది అని నిర్లక్ష్యంగా మాట్లాడుతారు. పైగా ఇలాంటి వాళ్లే ప్రభుత్వాలపైన, ప్రజా ప్రతినిధులపైన విమర్శలు చేస్తుంటారు. ఓటు వేయడం చేతగాని తమకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదనే సోయి కూడా వీళ్లకు ఉండదు.

  • Publish Date - April 26, 2024 / 09:40 AM IST

Lok Sabha Elections : ఈ ప్రజాస్వామ్య దేశంలో సామాన్యుడి చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. కానీ లక్షల మంది ఓటర్లు ఆ ఆయుధానికి గౌరవం ఇవ్వడం లేదు. పోలింగ్‌ రోజు ఇంటి నుంచి బయటికిరారు. ఎవడు గెలిస్తే మనకేంది అని నిర్లక్ష్యంగా మాట్లాడుతారు. పైగా ఇలాంటి వాళ్లే ప్రభుత్వాలపైన, ప్రజా ప్రతినిధులపైన విమర్శలు చేస్తుంటారు. ఓటు వేయడం చేతగాని తమకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదనే సోయి కూడా వీళ్లకు ఉండదు.

మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. ఇలా ఓటు వేసేందుకు బద్దకించే వారిలో ఉన్నత విద్యావంతులైన యువతీయువకులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 19న జరిగిన లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో కూడా కేవలం 65.5 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. అంటే ప్రతి 100 మంది ఓటర్లలో 35 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇలాంటి ఓటర్లు సిగ్గుతో తలదించుకునేలా చేశాడు మహారాష్ట్రకు చెందిన ఓ పెండ్లి కొడుకు ఆకాశ్‌. కాసేపట్లో పెండ్లి పీటలు ఎక్కాల్సినవాడు పోలింగ్‌ కేంద్రానికి వచ్చాడు. చిత్తశుద్ధి ఉంటే ఎంత ముఖ్యమైన పని అయినా ఓటేసేందుకు అడ్డం కాదని నిరూపించాడు.

రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. అందులో మహారాష్ట్రలోని అమ్రావతి లోక్‌సభ స్థానం కూడా ఉంది. అమ్రావతిలోని వదార్‌పుర ఏరియాకు చెందిన యువకుడు ఆకాశ్‌ ఇవాళ మధ్యాహ్నం పెండ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అందుకోసం అతడిని పెండ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. ఆ పెండ్లి దుస్తుల్లోనే వచ్చి అతడు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. సాటి యువ ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు.

ఒక మనిషి జీవితంలో పెండ్లి అనేది అత్యంత ముఖ్యమైన కార్యమే అయినప్పటికీ.. ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా అంతకంటే ముఖ్యమైనదని ఆకాశ్ అన్నాడు. అందుకే పెండ్లి తంతుకు కొంత విరామం ఇచ్చి ఓటేసేందుకు వచ్చానని చెప్పాడు. ఆకాశ్‌ చేసిన పనిని పలువురు అభినందిస్తున్నారు. ఓటుకు అతడు ఇచ్చిన గౌరవాన్ని మెచ్చుకుంటున్నారు. ఆకాశ్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసేందుకు వచ్చిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.

Latest News