Bride Delivery | జీవితంలో పెళ్లి( Marriage ) అనేది మరుపురాని ఘట్టం. ఇక పెళ్లాయ్యక శోభనం( First Night ).. ఆ తర్వాత సంసార జీవితం మొదలవుతుంది. పిల్లలను కనేందుకు ప్లానింగ్ చేసుకుంటారు. కొందరు ఏడాది సమయం తీసుకుంటే.. మరికొందరు రెండేండ్ల సమయం తీసుకుంటుంటారు. ఈ సమయంలో తమ సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అన్యోన్యంగా గడుపుతుంటారు. అయితే ఓ పెళ్లి కుమారుడి( Groom )కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. శోభనం, సంసార జీవితం లేకుండానే.. పెళ్లైన రెండు రోజులకే తన భార్య తల్లి అయింది. దీంతో కొత్త పెళ్లికొడుకు ఆందోళనకు గురయ్యాడు. కొత్త పెళ్లికూతుర్ని( Bride ) తిరిగి పుట్టింటికి పంపించేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) ప్రయాగర్‌రాజ్( Prayagraj )లోని టర్మోలి గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఫిబ్రవరి 24వ తేదీన వివాహమైంది. ఇక 25వ తేదీన పెళ్లికుమారుడి ఇంటికి పెళ్లి కూతురి( Bride )తో పాటు ఆమె కుటుంబ సభ్యులు వచ్చారు. ఆ రోజు రాత్రంతా నూతన దంపతులతో పాటు కుటుంబ సభ్యులంతా డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. 26వ తేదీ ఉదయం.. కొత్త పెళ్లి కూతురు అందరికీ చాయ్ ఇచ్చింది. భర్తతో కాసేపు సరదాగా గడిపింది.
26వ తేదీ సాయంత్రానికి తన కడుపునొప్పి వస్తుందని భర్తతో ఆవిడ చెప్పింది. దీంతో కార్ఖానా సీహెచ్‌సీకి తరలించారు. కొత్త పెళ్లి కూతురు 9 నెలల గర్భిణిని, తప్పనిసరిగా సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో కొత్త పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు. తప్పని పరిస్థితుల్లో కొత్త పెళ్లికూతురుకు డెలివరీ చేయగా, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యుల ఆందోళన
పెళ్లి కూతురు ఇచ్చిన షాక్‌తో పెళ్లి కుమారుడితో పాటు అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె గర్భిణి అని తమతో ఎందుకు దాచిపెట్టారు అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తమకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతేడాది మే నుంచి రిలేషన్‌లో..
అయితే వీరి పెళ్లి గతేడాది మే నెలలో డిసైడ్ అయిందని పెళ్లి కుమార్తె తండ్రి తెలిపాడు. నాటి నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని చెప్పాడు. ఈ క్రమంలోనే తన బిడ్డ గర్భం దాల్చిందని తండ్రి పేర్కొన్నాడు.
నాకేం పాపం తెలియదు.. వరుడి వివరణ
తనకు పెళ్లి ఫిక్స్ అయిందే గతేడాది అక్టోబర్‌లో. అసలు తాను ఆమెతో రిలేషన్‌లో లేను. పెళ్లి కూతురు తండ్రి చేసే ఆరోపణలు అవాస్తవం. ఆ బిడ్డ తనకు పుట్టలేదని.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని పెళ్లి కుమారుడు స్పష్టం చేశాడు.