వైఎస్సార్ పేరును సీబీఐ చార్జ్‌షీట్‌లో చేర్పించింది జగనే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కంటే ఎక్కువగా ఏపీ పీసీసీ వైఎస్‌. షర్మిలా నుంచి ఎదురవుతున్న విమర్శనాస్త్రాలు ఎక్కువగా చికాకు పెడుతున్నాయి.

  • Publish Date - April 26, 2024 / 12:37 PM IST

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విధాత: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కంటే ఎక్కువగా ఏపీ పీసీసీ వైఎస్‌. షర్మిలా నుంచి ఎదురవుతున్న విమర్శనాస్త్రాలు ఎక్కువగా చికాకు పెడుతున్నాయి. గుంటూరు, తిరువూరు ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడిన షర్మిల సీఎం జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. పులివెందులలో సీఎం జగన్ తన నామినేషన్ సభలో ఆరోపించినట్లుగా వైఎస్సార్ పేరును సీబీఐ చార్జ్‌షీట్‌లో చేర్చించింది కాంగ్రెస్ పార్టీ కాదని, జగన్మోహన్‌రెడ్డినే ఆ పని చేశారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

కేసుల నుంచి బయట పడేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో హైకోర్టులో పిటీషన్ వేయించి మరి చార్జ్‌షీట్‌లో వైఎస్సార్ పేరును జగన్ చేర్పించాడని ఆమె ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు పొన్నవోలుకు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడని, ఇది నిజం కాదని దమ్ముంటే జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్సార్‌పై సీబీఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పాత్ర లేనే లేదని ఆమె స్పష్టం చేశారు.

వైఎస్ కుటుంబ శత్రువుల కుట్రలో షర్మిల, సునితలు భాగమయ్యారని, పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ముందు షర్మిల మోకారిల్లారంటూ చేసిన విమర్శలపై షర్మిలా ఘాటుగా స్పందించారు. బహిరంగ సభలో చెల్లెలు చీర గూర్చి అన్న స్థానంలో ఉన్న జగన్‌ ప్రస్తావించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. పసుపు చీర కట్టుకుంటే కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. సాక్షి పేపర్‌, చానల్ పైన పసుపు రంగు ఉందని, దానిపై ఆనాడు వైఎస్సార్ పసుపు రంగు ఉంటే తప్పేముందని, అదేమి చంద్రబాబు సొంతం కాదని చెప్పారన్నారు.

చంద్రబాబు రాసిచ్చిన స్క్రీఫ్టు చదవాల్సిన అవసరం లేదని, రాసిచ్చిన స్క్రీఫ్టును చదివేది జగన్ మోహన్‌రెడ్డినే అని ఎద్దేవా చేశారు. నేను చంద్రబాబుకు మోకారిల్లానని జగన్ అంటున్నాడని, నేను వైఎస్సార్ బిడ్డనని, ఎవరి ముందు మోకారిల్లే అవసరం నాకు లేదన్నారు. జగన్ కేసుల నుంచి బయటపడేందుకు నరేంద్రమోదీ ముందు మోకారిల్లుతున్నాడని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని విమర్శించారు. మోదీకి జగన్ దత్తాప్రుత్రుడిగా మారడని షర్మిల విమర్శించారు. సీబీఐ స్పష్టంగా వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలు చూపినప్పటికి అవినాశ్‌ను జగన్ వెనుకేసురావడం ఎందుకని ప్రశ్నించారు.

Latest News