అమరావతి : వైఎస్.షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించడం ఆ పార్టీ, ఏపీ ప్రజల దౌర్బాగ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ విమర్శించారు. దళిత వాడల్లో టీటీడీ గుడుల నిర్మాణాలను షర్మిల తప్పుబట్టడాన్ని మాధవ్ తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్..హిందుత్వ అంశాలపైన, దేవాలయ వ్యవస్థపైన అవగాహన లేని షర్మిల మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. భర్తతో కలిసి షర్మిల స్వయంగా మత మార్పిడులు..మత ప్రచారం చేసిన నేపథ్యం మరువరాదన్నారు.
ఆలయాలు వద్దు మరుగుదొడ్లు కట్టండి అని షర్మిల చేసిన వ్యాఖ్యల వెనుక సోనియాగాంధీ ప్రమేయం కూడా ఉండవచ్చన్నారు. దేవాలయాలకు వచ్చే డబ్బులు దేవాలయాలకు కాకుండా మరోదానికి వినియోగించాలంటూ మాట్లాడిన షర్మిల ముస్లింలు, క్రైస్తవులకు కూడా ఇలాగే చెప్పే సాహనం చేయగలరా..? అని మాధవ్ ప్రశ్నించారు. దేవాలయ వ్యవస్థను అగౌరవపరిచి హిందువుల మనోభావాలను కించపరిచిన దానిపై షర్మిల, సోనియాగాంధీలు భేషరతుగా క్షమాపణలు చెప్పలని..లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.