Site icon vidhaatha

పార్లమెంటులో బీజేపీకి మా అవసరం ఉంది

ఎన్డీఏ బిల్లులకు మద్దతునిస్తాం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

విధాత : పార్లమెంట్‌లో బీజేపీకి మా అవసరం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో టీడీపీకి ఉన్నంత బలం తమకూ ఉందని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. టీడీపీ 16 లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయని, మాకు రాజ్యసభ 11, లోక్ సభ 4 సీట్లు కలిపి 15 ఉన్నాయన్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్‌లో మా బలం తగ్గలేదని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బీజేపీకి మా అవసరం ఉందని గుర్తించాలన్నారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో ఎన్డీఏ ప్రవేశ పెట్టే బిల్లులకు మద్దతిస్తామని వివరించారు

రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంటులో వాళ్లు టీడీపీపై ఎంత ఆధారపడతారో, వైసీపీపై రాజ్య‌స‌భ‌లో అంతే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది“ అని సాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు.. ఈ విష‌యాన్ని బీజేపీ పెద్ద‌లు గ‌మ‌నించే ఉంటార‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పారు.

Exit mobile version