విధాత:ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఐదు లక్షల కోట్ల రూపాయలకుపైగా రుణభారం ఉన్నదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదన్న వార్తల నేపథ్యంలో, జవాబుదారితనంతో, పారదర్శకంగా పాలన సాగిస్తున్న ప్రభుత్వం అయితే అప్పులపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలి.
బహిరంగ మార్కెట్ ద్వారా సేకరించిన రుణం, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు, విదేశీ రుణ భారం మరియు రాష్ట్ర ప్రభుత్వం హామీ మీద వివిధ ప్రభుత్వ కార్పోరేషన్స్ మరియు స్థానిక సంస్థలు చేసిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిలు, ఉపాధి హామీ పథకం మరియు ఇతర పథకాల పద్దుల క్రింద చెల్లించాల్సిన బకాయిలు, ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, వగైరా వివరాలను సవివరంగా పేర్కొంటూ శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై స్పష్టత వస్తుంది. తద్వారా ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పడానికి దోహదపడుతుంది.
టి.లక్ష్మీనారాయణ
సమన్వయకర్త,