Site icon vidhaatha

పాపాలు చేసిన వారిని తొక్కి పడేయండి

విధాత : పాపాలు చేసిన వారిని తొక్కిపడేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. కడపలోని రాజారెడ్డి వీధిలోని చర్చిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. “పాపులను తరిమికొట్టాలంటే ప్రార్ధన సరిపోదని.. వైర్యంగా ఎదుర్కోవాలన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని, ఎవరికీ భయపడకండి. దైవం ఏసుప్రభు అండగా ఉన్నాడని ఉద్బోధించారు. దేవునిపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోండని సూచించారు. అనిల్‌కుమార్ చేసిన ఆ వ్యాఖ్యలు పరోక్షంగా ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసినవేనన్న చర్చ జోరందుకుంది. నిన్నటిదాకా బంధువులుగా ఉన్న వైఎస్‌. జగన్‌, ఆయన సోదరి షర్మిల, జగన్ బావ అనిల్‌కుమార్‌లు, మరో సోదరి సునిత, మధ్యలో లేఖలతో వారి చిన్నమ్మలు నేడు రాజకీయ ప్రత్యర్థులుగా వేర్వేరు పార్టీల నేతలుగా పరస్పరం పరస్పర విమర్శలు చేసుకుంటున్న తీరు ఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.

Exit mobile version