Site icon vidhaatha

మొక్కలు చనిపోతే సర్పంచుల పై వేటు..పెద్దిరెడ్డి

విధాత:సర్పంచ్ లు, అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మొక్కల సంరక్షణ బాధ్యత మీదే అని తేల్చి చెప్పారు. ఒకవేళ మొక్కలు చనిపోతే వేటు పడుతుందని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల వెంబడి 17వేల కిలోమీటర్ల పొడవున ఈ ఏడాది కోటి మొక్కల్ని నాటేందుకు ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా.. రాష్ట్రంలో పచ్చదనం విలసిల్లేలా అధికారులు, సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. పచ్చతోరణం కార్యక్రమం నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ 13 జిల్లాల అధికారులకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం వర్క్‌షాప్‌ జరిగింది.

ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రాన్ని ఆకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నది సీఎం జగన్ సంకల్పమని, నాటిన మొక్కల్లో 90 శాతానికి పైగా బతికించాలన్నది ఆయన లక్ష్యమని మంత్రి చెప్పారు

Exit mobile version