Site icon vidhaatha

రాజకీయాలు గురించి పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

విధాత‌: శ్రీకాకుళం పట్టణంలో చేనేత బజార్ ప్రారంభ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్ గారు పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి రెండు ప్రాంతాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి యాక్టర్. రాజకీయాలు గురించి పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి‌తో మీరు పోల్చుకోకండి. ఆయనకు ఆయనే సాటి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, లోకేష్ విమర్శించడం సబబుగా లేదు. ఆలోచించి మాట్లాడితే మంచిది’’ అని కృష్ణదాస్ పేర్కొన్నారు.

Exit mobile version