Site icon vidhaatha

బక్రీద్ పండుగ సందర్భంగా బహిరంగ నమాజులు నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం

విధాత:కరోనా మూడవ దశ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈద్గా ఆవరణలో గాని ఇతర బహిరంగ ప్రదేశాల్లో గాని బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ చదవడానికి నిషేధిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు పరిమిత సంఖ్యలో మసీదులలో లేక వారి ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్త వహించాలని వారు ఓ ప్రకటనలో తెలిపారు..

Exit mobile version