Deputy CM Pawan Kalyan | కూతురు ఆధ్యతో కలిసి శ్రీహరి కోట షార్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కూతురు ఆధ్యతో కలిసి శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. షార్‌లో ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు

విధాత, హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కూతురు ఆధ్యతో కలిసి శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. షార్‌లో ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. షార్ హెలిప్యాడ్ వద్ద అధికారులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు.

తొలుత హైదారాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో పవన్‌కు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జేసీ శుభం బన్సల్‌లు స్వాగతం పలికారు. షార్ సందర్శనలో భాగంగా పవన్ కల్యాణ్ అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు.