Site icon vidhaatha

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు… పలు రైళ్లు నిలిపివేత

విధాత, హైదరాబాద్ : కృష్ణ పట్నం పోర్టు నుంచి గోండియా వెలుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గూడ్స్ రైలు కృష్ణపట్నం పోర్ట్ నుంచి గోండియా వెళ్తుండగా నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్ లో పట్టాలు క్రాస్ చేస్తుండగా పట్టాలు తప్పింది. బోగీలు పట్టాలపై పడిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే శాఖ హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.

Exit mobile version