Site icon vidhaatha

AP Violence | ఏపీ అంతటా ముందస్తు బందోబస్తు.. సీఎస్‌తో డీజీపీ భేటీ

పల్నాడు జిల్లాల్లో కొనసాగుతున్న 144సెక్షన్‌

విధాత, హైదరాబాద్ : ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంతో పాటు జూన్ 4న జరిగే కౌంటింగ్ దృష్ట్యా రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు ఉదృతం కాకుండా ఏపీ పోలీసు శాఖ ముందస్తుగా బందోబస్తు చర్యలు తీసుకుంటుంది. ఏపీ వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగిస్తున్నారు. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో శాంతిభద్రతలపై డేగకన్ను వేశారు. అయినప్పటికి పోలీస్ శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో సైతం కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాక కార్టన్ సెర్చ్‌లో 1140వాహనాలు సీజ్ చేశారు. 301సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తు కొనసాగిస్తున్నారు. అల్లర్లకు కారణమయ్యే వారిని ముందస్తుగా బైండోవర్ చేసి కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రౌడీ షీట్స్ ఉన్నవారిని కౌంటింగ్ రోజున పోలీస్ స్టేషన్‌కు పిలవాలని పోలీసులు నిర్ణయించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు తరలించనున్నారు.

కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. కౌంటింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇంటలిజెన్స్ ఎన్నికల ఫలితాల సందర్భంగా మళ్లీ హింస తలెత్తే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పల్నాడు జిల్లాలో ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. గొడవలు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు వరుసగా 8వ రోజూ కూడా షాపులను పోలీసులు మూసేయించారు.

మరోవైపు ఎన్నికల హింసపై సిట్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏలాంటి ఆదేశాలిస్తుంది..వాటిపై ఏ చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చించేందుకు సీఎస్‌ జవహార్‌రెడ్డితో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా భేటీ అయ్యారు.

Exit mobile version