Site icon vidhaatha

జగన్‌పై ఈడీ కేసుల విచారణ వాయిదా

గుంటూరు : జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులపై విచారణను ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టు జులై 2వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ కేసుల అనంతరం ఈడీ కేసులను విచారించాలన్న తమ పిటిషన్లను కొట్టేస్తూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించినట్లు రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. తమ పిటిషన్లపై సత్వరం విచారణ చేపట్టేలా చూడాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లేఖ సమర్పించినట్లు చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందున విచారణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. దీంతో సీబీఐ కోర్టు ఈడీ కేసులపై విచారణను వాయిదా వేసింది. దీంతోపాటు హెటెరో, అరబిందో కేసులో తన తరఫున సహ నిందితుడు హాజరయ్యేందుకు అనుమతించాలని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌నూ జులై 2వ తేదీకి వాయిదా వేసింది.

Readmore:జగన్‌ మీద కేసుల ఉపసంహరణపై నేడు హైకోర్టు సుమోటో విచారణ

Exit mobile version