Site icon vidhaatha

సీఎంఓ అధికారులతో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు

విధాత: సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల చర్చలు ముగిశాయి. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌ సీఎం అయ్యాక ఉద్యోగుల ప్రాధాన్యం పెరిగిందని, ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని చెప్పారు. సంక్షేమంలో తమ ప్రభుత్వం రెండు అడుగుల ముందే ఉందన్నారు. కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు పీఆర్‌సీతో సహా సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని సజ్జల స్పష్టం చేశారు.

Exit mobile version