విధాత: కృష్ణ జిల్లా,అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి ఏసుబాబు కు చెందిన పశువుల పాక పూర్తిగా దగ్దమైనది. ఈ ప్రమాదంలో 2 గేదెలు మృత్యువాత పడగా, మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పశువులు ఆ మంటల్లో కాలిపోయాయి. పశువులను మేపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన గేదెలు మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన విఆర్వో గుడివాక శేషుబాబు, పశువైద్యాధికారులు.అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సివుంది.
కొత్తపేట అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మూగజీవాలు
<p>విధాత: కృష్ణ జిల్లా,అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి ఏసుబాబు కు చెందిన పశువుల పాక పూర్తిగా దగ్దమైనది. ఈ ప్రమాదంలో 2 గేదెలు మృత్యువాత పడగా, మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పశువులు ఆ మంటల్లో కాలిపోయాయి. పశువులను మేపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన గేదెలు మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు […]</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి