Site icon vidhaatha

ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి

విధాత‌: ప్రకాశం బ్యారేజ్ కు సుమారు 5 లక్షల క్యూసెక్కుల‌వరకు చేరనున్న వరద నీరు.వరద ఉధృతి పై అధికారులను మరింత అప్రమత్తం చేసిన కృష్ణా జిల్లాకలెక్టర్ జె. నివాస్. సోమవారం ఉదయం 7.00 లకు పులిచింతల ప్రాజెక్ట్ వద్ద నున్న 3,56,486 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ,ఇన్ ఫ్లో 3,56,486 క్యూసెక్కులు.

ప్రస్తుతo ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 57,674 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 48,425 క్యూసెక్కులు గా వుంది దీంతో వరద ముంపు ప్రభావిత అధికారులను జిల్లా కలెక్టర్ మరింత అప్రమత్తం చేశారు. జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్ల్ అప్రమత్తంగా ఉండాలి.చిన లంక,పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయకూడ‌ద‌ని హెచ్చ‌రించారు.

Exit mobile version