Site icon vidhaatha

Botsa Satyanarayana | ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స ప్రమాణ స్వీకారం

విధాత, హైదరాబాద్ : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ మండలి చైర్మన్ మోషన్ రాజు తన చాంబర్‌లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పోటీకి దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన నేపథ్యంలో వైసీపీ నుంచి బొత్స మాత్రమే బరిలో ఉండడంతో… ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్‌. జగన్ ఎమ్మెల్సీ బొత్సకు అభినందనలు తెలిపారు. ప్రమాణానికి ముందు జగన్‌ను క్యాంపు కార్యాలయంలో బొత్స మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్. మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జెడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, తీసుకొచ్చిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి. కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభా హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Exit mobile version