విధాత: రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య వైఖరిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య అనాగరిక సమాజంలో ఉన్నట్లు మెసలడాన్ని ఖండిస్తున్నాం.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రవీణ్ ఆదిత్య వద్దకు వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే వంపల రాజేశ్వరితోసహా పలువురిని కింద కూర్చోబెట్టారు.అతని అహంకారానికి, అహంభావానికి ఇది నిదర్శనం.తక్షణమే ప్రవీణ్ ఆదిత్యను రంపచోడవరం నుండి బదిలీ చేయాలి,ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.