విధాత: కర్నూలు ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ప్రారంభం అయ్యింది.రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి , జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం , నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావు , జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు .
అంతకు ముందు హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి. శ్రీనివాస రావు లకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభతో స్వాగతం పలికారు.
కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డి.ఆర్.ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్.డి.ఓ హరిప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, తదితరులు .
రూమ్ నెంబర్-1లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఛాంబర్ ఏర్పాటు చేయగా రూమ్ నెంబర్ – 2 లో జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఛాంబర్,రూమ్ నెంబర్ -4 లో నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావు ఛాంబర్ ఏర్పాటు చేశారు.