అమరావతి : ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అవినీతి వ్యవహారాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బుధవారం ఒక్కరోజునే ఏపీ వ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోసోదాలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
విశాఖ,అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు అనకపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ విస్తృత దాడులు చేపట్టింది.
