Nalgonda : ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్ధార్

నల్గొండ డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. వివరాలు ఇవ్వడానికి 15 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఆరోపణలు ఉన్నాయి.

Deputy Tahsildar

విధాత: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ దూకుడు మీద సాగుతుంది. సగటున రోజుకో అవినీతి అధికారిని పట్టుకుంటుంది. తాజాగా చండూరు డిప్యూటీ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ను లంచం సొమ్ముతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం తెరెడ్డిపల్లికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదుదారుల వివరాలు కోరారు. వివరాలు అందించేందుకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ వారి నుంచి రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో లంచం తీసుకుంటూ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ రికార్డుల ఏడీ శ్రీనివాస్‌ వద్ధ దాదాపు రూ.100కోట్ల అక్రమాస్తులు ఏసీబీ సోదాలలో వెల్లడవ్వడం రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల అవినీతికి నిదర్శనంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి :

Akhanda 2 | ‘అఖండ 2’ రిలీజ్ విష‌యంలో ఇంత ర‌చ్చ నడుస్తున్నాబాల‌య్య మౌనం… కార‌ణం ఏంటి?
Rain Alert | తెలంగాణ‌లో నేడు, రేపు తేలిక‌పాటి వ‌ర్షాలు..!

Latest News