Exit Polls | ఏపీలో కూటమిదే అధికారం..పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో టీడీపీ కూటమి విజయకేతనం ఎగురవేయబోతుందని పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌ సర్వే ప్రకారం టీడీపీకి 95-110సీట్లు, జనసేనకు 14-20సీట్లు, బీజేపీకి 2-5 సీట్లు, వైసీపీకి 45- 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది

  • Publish Date - June 1, 2024 / 07:03 PM IST

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
టీడీపీకి 95-100 సీట్లు
జనసేనకు 14-20
బీజేపీకి 2-5
వైసీపీకి 45-60
ఎంపీ సీట్లలోనే కూటమిదే హవా

విధాత : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో టీడీపీ కూటమి విజయకేతనం ఎగురవేయబోతుందని పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌ సర్వే ప్రకారం టీడీపీకి 95-110సీట్లు, జనసేనకు 14-20సీట్లు, బీజేపీకి 2-5 సీట్లు, వైసీపీకి 45- 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 52 శాతం ఓట్లు, వైసీపీకి 44 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చే అవకాశం- పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది.

పార్లమెంటు స్థానాల్లోనూ కూటమికే మెజార్టీ సీట్లు
ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ 13-15సీట్లు, జనసేన 2 , బీజేపీ 2- 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని, వైసీపీ 3-5స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తన సర్వేలో అంచనా వేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 50-54% ఓట్లు, వైసీపీకి 42-45% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1- 2% ఓట్లు, ఇతరులకు 3-4% ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

కూటమి ఖాతాలో 111-135సీట్లు
టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి 111-135 అసెంబ్లీ స్థానాలను గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే వెల్లడించింది. వైసీపీ 45-60 స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల 48 శాతం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయగా, 32 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. వైసీపీకి మరోకసారి అవకాశం ఇస్తారా అని అడిగ్గా 51 శాతం ఇవ్వమని, 42 శాతం ఇస్తామని చెప్పారని వెల్లడించింది. ఈ ఎన్నికల తర్వాత ప్రస్తుత సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని 38 శాతం, చంద్రబాబు కావాలని 40 శాతం, పవన్ కళ్యాణ్ కావాలని 12 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని పీపుల్స్ పల్స్ పేర్కోంది. అదే సమయంలో ప్రధానమంత్రి ఎవరు కావాలని అడిగినప్పుడు నరేంద్రమోదీకి 48 శాతం, రాహుల్ గాంధీకి 38 శాతం మంది మద్దతు తెలిపారని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని వ్యక్తిగత అభిప్రాయం కింద అడిగినప్పుడు 54 శాతం మంది కూటమి వైపు, 44 శాతం వైసీపీ వైపు నిలబడ్డారని, ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా 52 శాతం మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, 41 శాతం మంది వైసీపీ అని చెప్పారు పీపుల్స్ పల్స్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సంస్థ మే 16 నుంచి 20 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో భాగంగా 6,900 శాంపిల్స్ సేకరించింది.

Latest News