స్టీల్ ఫ్లాంటు అమ్మకుండా నేను కష్టపడ్డాను: కేఏ పాల్

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో తాను గొంతుపోగా వాదించి ఆర్డర్ తెస్తే మీడియా నా కృషిని గుర్తించకుండా ఆ క్రేడిట్‌ను జేడీకి, ఇతరులకు అపాదిస్తుందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తప్పుబట్టారు.

  • Publish Date - April 26, 2024 / 04:40 PM IST

క్రేడిట్ మరొకరికి ఇస్తారా
మీడియా పై కేఏ పాల్ శాపనార్థాలు

విధాత, హైదరాబాద్‌ : విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో తాను గొంతుపోగా వాదించి ఆర్డర్ తెస్తే మీడియా నా కృషిని గుర్తించకుండా ఆ క్రేడిట్‌ను జేడీకి, ఇతరులకు అపాదిస్తుందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తప్పుబట్టారు. ఇలా కష్టపడిన వారికి కాకుండా మరెవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనమవుతాయంటూ శాపనార్ధాలు పెట్టారు. ఫిబ్రవరి 21న కోర్టులో కేసు ఫైల్ చేసి, పదిసార్లు వాదించి ఏప్రిల్‌ 25న ఆర్డర్స్ తీసుకొచ్చానని, ఒక్క ఇంచూ అమ్మకుండా ఆర్డర్ తెచ్చానని చెప్పారు.

హైకోర్టులో జేడీతో పాటు మరికొందరు వేసిన పిటిషన్లు నా తర్వాతే లిస్టు అయ్యాయని, జేడీ ఒక్కసారి కోర్టుకు రాలేదన్నారు. తాను ఎంతో కష్టపడి గవర్నమెంటును ఫ్లాంట్‌ను అమ్మకుండా అర్డర్ తెస్తే మరెవరికో ఆ క్రేడిట్ ఇవ్వడం సరికాదన్నారు. సత్యన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే మీకు ఎలా ఉంటదన్నారు. రెండు నెలలు కష్టపడి పది రోజులు వాదించి, 40రోజులు ప్రిపేర్ చేసి, కోర్టు చుట్టు రాత్రింబవళ్లు తిరిగానన్నారు. స్టిల్ ప్లాంట్ అమ్మకుండా ఇంత కష్టపడిన నన్ను కాదని మీడియా ఇతరులకు క్రెడిట్ ఇవ్వడాన్ని దేవుడి క్షమించడని, వారి కుటుంబాలు సర్వనాశనమవ్వకపోతే నా పేరు కేఏపాల్ కాదని..మిమ్మల్ని విడిచిపెట్టనన్నారు.

Latest News