Site icon vidhaatha

Leopard | తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

విధాత : తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది. నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరించడం, అలానే అడవి గ్రామానికి దగ్గరగా ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. చిరుత సంచారం సమాచరంతో అటవీ అధికారులు ఆ ప్రాంతంలో చిరుత కదలికలపై ఆరా తీస్తున్నారు.

 

Exit mobile version