అమరావతి : ఏపీలో ప్రభుత్వం ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. 25 మంది ఐఏఎస్ అధికారులతో పాటు డైరెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సహా మొత్తం 31మందిని బదిలీ చేసింది. వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్ జిలానీ సామున్, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, ఏపీపీఎస్సీ సెక్రెటరీగా రవి సుభాష్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్ లోతేటి, పౌరసరఫరాలశాఖ వైస్ ఛైర్మన్‌గా ఎస్.ఢిల్లీరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పి. రంజిత్‌బాషా, హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీగా అరుణ్‌బాబు నియమితులయ్యారు.
సీసీఎల్ ఏ సంయుక్త కార్యదర్శిగా చేతన్ ను, వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా నవ్యను, ఎయిర్ పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను, సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్ ను, ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా చిన్న రాముడిని, ట్రాన్స్ కో జేఎండీగా ప్రవీణ్ చంద్ ను నియమించారు. బాపట్ల జేసీగా భావన, సాంఘిక సంక్షేమ శాఖ ఉప కార్యదర్శిగా విష్ణు చరణ్ , వైద్యారోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీగా శోభికకు, మారిటైమ్ ఇన్ ఫ్రా డెవప్మెంట్ కార్పోరేషన్ ఎండీ, డైరెక్టర్ గా అభిషేక్ కుమార్ నియామితులయ్యారు.
నంద్యాల జేసీగా కార్తీక్ , పరిశ్రమలశాఖ డైరెక్టర్ గా శుభం బన్సల్ , ఏలూరు జేసీగా అభిషేక్ గౌడ, కర్నూలు జేసీగా నూరుల్ కామర్ , రాజమండ్రి కమిషనర్ గా రాహుల్ మీనా, కాకినాడ జేసీగా అపూర్వ భరత్ , సత్యసాయి జిల్లా జేసీగా మౌర్య భరద్వాజ్, హౌసింగ్ శాఖ కార్యదర్శిగా వెంకట్ త్రివినాగ్ , డైరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా మురళీధర్ లను నియమించింది. లిడ్ క్యాప్ వీసీ, ఎండీగా ప్రసన్న వెంకటేష్ కు, శాప్ ఎండీగా భరణికి, అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీగా శ్రీపూజను నియమించారు.