విధాత: ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసుల తీరు ఎండగడుతూ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. లేఖలో గణేష్.. ‘‘ఏజెన్సీలో మావోయిస్టులు గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. గంజాయితో షావుకార్లు, దళారులు, పోలీసులు మాత్రమే బాగుపడతారు. గతంలో ముంచుంగిపుట్టు ఎస్ఐ అరుణ్ కుమార్, పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ గంజాయ్ వ్యాపారం చేస్తూ లక్షల సంపాదనతో లబ్ది పొందారు. అదే విధంగా దుంబ్రిగూడ ఎస్ఐ తమ పరిధిలో ఉన్న పంచాయతీ గ్రామాల్లో గంజాయి సాగు చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కిదారి ఘటన వెనుక దుంబ్రి గూడ పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడానికి ఇదే కారణం. గంజాయి సాగు విషయంలో సీఐ, సీఐల నుంచి పై అధికారుల వరకూ బాగుపడుతున్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సాగును అరికట్టాలని ఉద్దేశంతో పరివర్తన పేరిట ఆదివాసి గ్రామాలపై పోలీసుల దాడులను ప్రజలంతా తిప్పికొట్టాలి’’ అని పేర్కొన్నారు.
పోలీసులకు ఏవోబీ కార్యదర్శి గణేష్ లేఖ
<p>విధాత: ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసుల తీరు ఎండగడుతూ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. లేఖలో గణేష్.. ‘‘ఏజెన్సీలో మావోయిస్టులు గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. గంజాయితో షావుకార్లు, దళారులు, పోలీసులు మాత్రమే బాగుపడతారు. గతంలో ముంచుంగిపుట్టు ఎస్ఐ అరుణ్ కుమార్, పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ గంజాయ్ వ్యాపారం చేస్తూ లక్షల సంపాదనతో లబ్ది పొందారు. అదే విధంగా దుంబ్రిగూడ ఎస్ఐ తమ పరిధిలో ఉన్న పంచాయతీ […]</p>
Latest News

మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్
ఇంద్రజ జబర్ధస్త్ జడ్జ్‌గా ఎలా ఫిక్స్ అయింది..
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం