Site icon vidhaatha

Canada | సిగ‌రెట్లు, గంజాయి ఇచ్చి బాలిక‌లపై అత్యాచారాలు.. తండ్రీ కొడుకులు అరెస్టు

విధాత‌: కెన‌డా (Canada)లో ఘోరం వెలుగుచూసింది. మైనర్ బాలిక‌ల‌కు సిగ‌రెట్లు, ఆల్క‌హాల్, గంజాయి, డ్రగ్స్ ఇస్తూ వాటికి బ‌దులుగా వారిపై తండ్రీ కుమారులు అత్యాచారాల‌కు పాల్ప‌డ్డారు. గ‌త కొన్ని నెల‌లుగా ప‌లువురు బాలిక‌ల‌పై వారు ఈ నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని పోలీసులు తెలిపారు.

దీనికి సంబంధించి భార‌తీయ సంత‌తి కెన‌డియ‌న్లు 24 ఏళ్ల సుమ్రిత్ వాలియా, 56 ఏళ్ల గురుప్ర‌తాప్ సింగ్ వాలియాల‌ను అరెస్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఇద్ద‌రినీ ఆల్బెర్టా ప్రావిన్స్‌కు చెందిన కాల్గ‌రీ న‌గ‌ర పౌరులుగా గుర్తించారు.

Exit mobile version