విధాత:కృష్ణా జిల్లా పులిచింతల ప్రాజెక్టును మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని సందర్శించారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో వర్షాలు పడిన కారణంగా.. రాష్ట్రంలోని జలాశయాలు పూర్తి జలకళను సంతరించుకువన్నట్టు చెప్పారు. ప్రాజెక్టులు నిండడంపై… రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రుల బృందం తెలిపింది.