విధాత : ఏపీ గత పాలకులు నా కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసు పెట్టారంటూ రిటైర్డ్ సీజేఐ ఎన్.వి.రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలు కష్టకాలంలోనే పరీక్షకు గురవుతాయి…గత పాలకుల నిర్ణయాలతో అమరావతి కష్టాలకు గురైందన్నారు. నా కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసు పెట్టారు…అయినా నేను భరించానన్నారు. * కష్టకాలంలో విట్ వంటి వర్సిటీ అండగా నిలబడిందన్నారు.
శనివారం అమరావతి విట్ యూనివర్సిటీ 5వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రైతుల కష్టం, వారి త్యాగంతో అమరావతి నిర్మాణం జరుగుతోందన్నారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు ఎన్.వి.రమణ ధన్యవాదాలు తెలిపారు.
