Site icon vidhaatha

Viral: సీతమ్మకు.. తాళి కట్టిన ఎమ్మెల్యే (Video)

విధాత: శ్రీరామ నవమి వేడుకల్లో సీతారాముల పెళ్లిలో ఓ ఎమ్మెల్యే సీతమ్మకు తాళి కట్టడం వివాదస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఎమ్మెల్యే తీరును రామభక్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన సీతారాములు కల్యాణోత్సవంలో ముఖ్య అతిధిగా హాజరైన అలూరు ఎమ్మెల్యే విరుపాక్షి సీతమ్మకు తాళి కట్టాడు. వేద పండితులు సీతమ్మ మెడలో ధరింపచేయాల్సిన తాళిని విరూపాక్షి కట్టడం విదాస్పదమైంది.

దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పండితుల సూచన మేరకు యాదృచ్చకంగానే విరూపాక్షి ఆ పని చేసినప్పటికి ఈ వ్యవహారం వివాదా స్పదమైంది. దీంతో మేల్కొన్న ఎమ్మెల్యే విరూపాక్ష తాజాగా జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతూ వివరణతో కూడిన వీడియో విడుదల చేశారు. ఈ సంఘటన తెలియక జరిగిందని, హిందూ సంఘాలు క్షమించాలని, రాజకీయ దురు ద్దేశం లేదని ఎమ్మెల్యే విరుపాక్షి వీడియోలో పేర్కొన్నారు. వేద పండి తుల సూచన మేరకే చేశానని, తప్పయితే క్షమించాలని కోరారు.

Exit mobile version