Chandrababu | తోబుట్టువు కట్టిన చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా..? : చంద్రబాబు

Chandrababu | వైఎస్ షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లిందని పులివెందులలో వైఎస్ జగన్ చేసిన విమర్శలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా, మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా..? అని ఆయన విమర్శించారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతా ద్వారా స్పందించారు. 'ఎంత నీచం..! ఇది కాదా వికృత మనస్తత్వం..?' అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

  • Publish Date - April 25, 2024 / 02:52 PM IST

Chandrababu : వైఎస్ షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లిందని పులివెందులలో వైఎస్ జగన్ చేసిన విమర్శలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా, మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా..? అని ఆయన విమర్శించారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఎంత నీచం..! ఇది కాదా వికృత మనస్తత్వం..?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా షర్మిలపై ఆయన మండిపడ్డారు. షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లిందని అన్నారు. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి చంద్రబాబు ఇంటికి షర్మిల వెళ్లారు. అప్పుడు ఆమె ధరించిన చీర రంగు గురించి జగన్ కామెంట్స్ చేశారు. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులు అని మండిపడ్డారు.

అవినాష్ ఏ తప్పు చేయలేదని తాను నమ్మాను కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని జగన్‌ చెప్పారు. ఈ మధ్య కొత్తగా వైఎస్సార్ వారసులమని కొందరు ప్రజల ముందుకు వస్తున్నారని అది వారి కుట్రలో భాగమని అన్నారు. ‘వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు..? నాన్నపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు..? ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు వైఎస్సార్ వారసులా..? వైఎస్‌కు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలే అని జగన్‌ వ్యాఖ్యానించారు.

అయితే జగన్‌ పులివెందుల ప్రసంగం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఇద్దరు చెల్లెళ్లే వైఎస్ వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని గట్టిగా ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలు చూపించి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైపు వైసీపీ నేత కోర్టుకు వెళ్లడంతో మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్‌పై కూడా కోర్టుకు వెళ్లారు. ఇలాంటి సమయంలో అవినాష్ రెడ్డికి సీఎం జగన్ పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా.. షర్మిల కట్టుకున్న చీరను బట్టి ఆమె టీడీపీతో కలిసి కుట్రలు చేస్తున్నట్లుగా మాట్లాటటం చర్చనీయాంశమైంది.

వైఎస్ అవినాష్ రెడ్డి, షర్మిల మధ్య కడప లోక్‌సభలో పోటీ జరుగుతోంది. తమకు న్యాయం చేయాలని షర్మిల కొంగు పట్టుకుని అడుగుతున్నారు. ఈ క్రమంలో షర్మిల చీరపై జగన్ చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత ఏ మహిళ పట్ల అలా మాట్లాడకూడదని.. సొంత చెల్లిపై అలా మాట్లాడటం ఇంకా దుర్మర్గమని టీడీసీ విమర్శిస్తున్నది.

Latest News