విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆమె తొలుతగా ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో 98%స్థానాలు వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకున్న సందర్భంగా జగన్ కు పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మహిళా సాధికారత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వాటి ఫలాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఇవే అంశాల ప్రధాన అజెండాతో రాష్ర్ట వ్యాప్తంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలవారీగా వివిధరంగాల మేధావులతో చర్చాగోష్టులకు శ్రీకారం చుట్టినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా మహిళా కమిషన్ చేపట్టిన ‘ఈ-నారీ’ వెబినార్ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు. ప్రధానంగా ‘దిశ’ చట్టం అమలుపై మాట్లాడుతూ ఇటీవల పార్లమెంటరీ కమిటీ విశాఖ పర్యటనలో భాగంగా ‘దిశ’ పోలీసు స్టేషన్ల పనితీరును మెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని గుర్తించడం శుభపరిణామమన్నారు. మహిళల భద్రత, రక్షణకు పనిచేసే ప్రభుత్వాలకు మహిళా కమిషన్ తోడ్పాటు ఉంటుందన్నారు.
సీఎంను కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్
<p>విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆమె తొలుతగా ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో 98%స్థానాలు వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకున్న సందర్భంగా జగన్ కు పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మహిళా సాధికారత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వాటి ఫలాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఇవే అంశాల ప్రధాన అజెండాతో రాష్ర్ట […]</p>
Latest News

మేడారంలో రేవంత్ కేబినెట్ భేటీ.. ఎజెండా ఇదే..!
జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు దర్శనం
యాదాద్రి భువనగిరి జిల్లాలో చిరుత కలకలం
వెండి, బంగారం ధరలకు హాలిడే
‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ ..
అనిల్ రావిపూడి స్పీడ్‌కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ