Vizag glass bridge| ఏపీలో గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం..పర్యాటకుల ఆసక్తి!

చైనాకే కాదండి..మనకు కూడా ఉంది ఓ భారీ గ్లాస్ బ్రిడ్జి. ఏపీలోని వైజాగ్ కైలాసగిరిలో నిర్మించిన అత్యాధునిక 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది. నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

అమరావతి : చైనాకే కాదండి..మనకు కూడా ఉంది ఓ భారీ గ్లాస్ బ్రిడ్జి. ఏపీ(Ap)లోని వైజాగ్ కైలాసగిరిలో నిర్మించిన అత్యాధునిక 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జి(Vizag glass bridge) ప్రారంభమైంది. నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే అతి పొడవైన ఈ వంతెన, కేరళలోని 40 మీటర్ల గ్లాస్ బ్రిడ్జి రికార్డును బ్రేక్ చేసింది. వీఎంఆర్​డీఏ, ఆర్​జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా రూ. 7 కోట్ల వ్యయంతో ఈ గాజు వంతెనను నిర్మించారు. గ్లాస్ బ్రిడ్జి రాత్రివేళ త్రివర్ణ లైటింగ్ తో మెరిసిపోతుంది. గాజు వంతెనను ఎంపీ ఎం. శ్రీభరత్ ప్రారంభించారు.

ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆదాయం మార్గాలు పెంచే క్రమంలో టూరిజం రంగానికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తుంది. సముద్ర తీరాలు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలు, నదీ తీరాలు, ప్రసిద్ధిగాంచిన ఆలయాల దగ్గర నుంచీ పురాతమైన కట్టడాలతో పాటు సహజ సిద్ధమైన ప్రకృతి వింతలున్న ప్రాంతాలతో పాటు వేర్వేరు చోట్ల విభిన్నమైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేసేలా ప్రణాళికలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా విశాఖలోని కైలాసగిరి ప్రాంతంలో గాజు వంతెన నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. పర్యాకులకు సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.

దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా విశాఖ కైలాసగిరి గాజు వంతెన గుర్తింపు పొందింది. 50 మీటర్ల పొడవుతో నిర్మించారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్​ గాజును దీని నిర్మాణానికి వినియోగించారు. ఒకేసారి 500 టన్నుల బరువును..100మందిని మోయగలదు. అయితే మందస్తు భద్రత దృష్ట్యా ఒకసారికి కేవలం 40 మందికి మాత్రమే అనుమతిస్తారు. ఈ వంతెన మీదుగా నడుస్తూ పర్యాటకులు ప్రకృతి అందాలు వీక్షించవచ్చు.

 

Latest News